మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం

S.No Name Designation Mobile Photo

ఈ పథకం భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.

ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడింది. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి. పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది.

దీనికి పల్లె ప్రాంతాల్లోని ప్రజలు సమీప కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఉపాధి వివరాల ఉత్తరం ద్వారా తెలియచేయబడతాయి. దీనికొరకు, వ్యక్తులుబ్యాంకులలో ఖాతా తెరవవలెను. వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

  1. ఆధార్ కార్డ్
  2. బ్యాంక్ ఖాతా బుక్
  3. రేషన్ కార్డ్
  4. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో